News April 10, 2024
కరణ్ జోహర్‌కు ‘దేవర’ నార్త్ హక్కులు

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను కరణ్ జోహర్, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకే రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News October 16, 2025
జనవరిలో 2వేల DSC పోస్టులకు నోటిఫికేషన్!

AP: మంత్రి లోకేశ్ హామీ మేరకు JAN-2026లో DSC నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ సన్నద్ధం అవుతోంది. త్వరలోనే టెట్ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. ఈసారి సుమారు 2వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పెషల్ DSC, మెగా DSCలో మిగిలిన 406 పోస్టులతో సహా రిటైర్ అయ్యే టీచర్ల ఖాళీలతో కలుపుకొని నోటిఫికేషన్ ఉండనుంది. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు తదితర అంశాల్లో NCTE నిబంధనలు అమలు చేయనున్నారు.
News October 16, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: ఉత్తమ్

TG: ఖరీఫ్ సీజన్లో 8,342 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. అలాగే సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 16, 2025
రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు

రబీ మొక్కజొన్నను OCT-15 నుంచి NOV-15 వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక(100-120), మధ్యకాలిక(90-100), స్వల్పకాలిక( 90 రోజుల కంటే తక్కువ) రకాలున్నాయి. రబీ మొక్కజొన్న సాగుకు అనువైన రకాలు D.H.M.111, D.H.M.115, D.H.M.117, D.H.M.121.
☛ హైబ్రిడ్ రకాలు: DHM-103, DHM-105, DHM-107, DHM-109
☛ కాంపోజిట్ రకాలు: అశ్విని, హర్ష, వరుణ్, అంబర్ పాప్‌కార్న్, మాధురి, ప్రియా స్వీట్‌కార్న్