News April 10, 2024
కరణ్ జోహర్‌కు ‘దేవర’ నార్త్ హక్కులు

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను కరణ్ జోహర్, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకే రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Similar News
News February 8, 2026
YS జగన్‌తో TVK విజయ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
News February 8, 2026
ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: CM

TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని CM రేవంత్ చెల్పూర్ సభలో ప్రకటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ పనిని ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలను, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.3వేలకోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.
News February 8, 2026
ఇంగ్లండ్‌పై పోరాడి ఓడిన నేపాల్

T20WC: ఇంగ్లండ్-నేపాల్ మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీపేంద్ర సింగ్(44), కెప్టెన్ రోహిత్ పౌడెల్(39) పోరాటం వృథా అయ్యింది. కుశాల్(29), లోకేశ్(39) కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 2, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కరన్, ఉడ్ తలో వికెట్ తీశారు.


