News November 2, 2024

TDP గూటికి కరణం బలరామ్?

image

AP: వైసీపీ సీనియర్ నేత కరణం బలరామ్ ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన TDP లేదా జనసేనలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. తన కుమారుడు కరణం వెంకటేశ్ కూడా పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ వేడుకలో CM చంద్రబాబుతో బలరామ్ ఆప్యాయంగా మాట్లాడారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా గత ఎన్నికల్లో చీరాల నుంచి YCP తరఫున వెంకటేశ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

Similar News

News December 6, 2024

పిల్లలకు ఈ పేర్లు పెట్టరు!

image

మా బిడ్డకు మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాం అంటే కొన్ని దేశాల్లో కుదరదు. పలు రకాల పేర్లు చట్ట విరుద్ధం. జర్మనీ, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్‌లో అడాల్ఫ్ హిట్లర్ పేరు పెట్టకూడదు. జపాన్‌లో అకుమా(దెయ్యం), మెక్సికోలో ఆల్‌ పవర్, సౌదీలో అమీర్, పోర్చుగల్‌లో అశాంతి, మలేషియాలో చౌ టౌ, యూకేలో సైనైడ్, డెన్మార్క్‌లో మంకీ, జర్మనీలో ఒసామా బిన్ లాడెన్, డెన్మార్క్‌లో ప్లూటోవంటి పేర్లపై నిషేధం ఉంది.

News December 6, 2024

పుష్ప-2 మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

image

‘పుష్ప-2’ సినిమాలోనివి అంటూ ఫేక్ డైలాగ్స్ ప్రచారం చేసే వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని మైత్రీ సంస్థ ప్రకటించింది. ‘ఊహాజనితమైన, సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2లోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పెట్టడం మానేయండి’ అని ట్వీట్ చేసింది. పైరసీపై వాట్సాప్‌లో(8978650014) రిపోర్ట్ చేయాలని కోరింది.

News December 6, 2024

12న ‘SDT18’ టైటిల్, గ్లింప్స్

image

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘SDT18’ టైటిల్‌, గ్లింప్స్‌ను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కత్తి పట్టుకుని ఉన్న పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీన్నిబట్టి తేజ్ ఈసారి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో రోహిత్ కేపీ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. ఐశ్వర్య లక్ష్మి, అనన్య నాగళ్ల కీలకపాత్రలో నటిస్తున్నారు.