News March 22, 2024
కర్మ వదిలిపెట్టదు.. కేజ్రీవాల్ అరెస్టుపై శర్మిష్ఠ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ స్వాగతించారు. ‘అప్పట్లో ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్, కాంగ్రెస్‌పై కేజ్రీవాల్, అన్నాహజారే గ్యాంగ్ నిరాధారమైన, క్రూరమైన ఆరోపణలు చేసింది. ఆమెకు వ్యతిరేకంగా ట్రంకు లోడు సాక్ష్యాలు ఉన్నాయని వారు చెప్పారు. ఇప్పటివరకు వాటిని ఎవరూ చూడలేదు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 6, 2025
కోహ్లీ గాయం శ్రేయస్‌కు వరమైంది!

కోహ్లీ గాయపడటం వల్లే ENGతో తొలి వన్డేలో తనకు ఆడే అవకాశం వచ్చిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ‘మ్యాచులో ఆడట్లేదని తెలిసి నిన్న రాత్రి సినిమా చూద్దామని అనుకున్నా. అప్పుడే కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. కోహ్లీ మోకాలికి గాయమైందని, అతని స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకే తొందరగా నిద్రపోయా’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఈ మ్యాచులో శ్రేయస్ 36 బంతుల్లో 59 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
News February 6, 2025
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ

TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.
News February 6, 2025
రూ.72 లక్షలు పెట్టి కష్టపడి వెళ్లినా..

అమెరికా పిచ్చితో హరియాణాకు చెందిన ఆకాశ్ (20) 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో US వెళ్లాడు. ఏజెంట్లకు మరో రూ.7 లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లానని తెలిపాడు. తాజాగా ఆకాశ్‌ను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. కాగా పంజాబ్, హరియాణా యువకుల్లో చాలా మందికి ఇంగ్లిష్‌పై పట్టు లేక US వీసాలు పొందలేకపోతున్నారు.