News January 3, 2025
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించారు. ఓ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 542 రన్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా ఆయన రికార్డులకెక్కారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆయన వరుసగా ఐదు ఇన్నింగ్సుల్లో నాటౌట్‌గా నిలిచారు. J&Kపై 112*, ఛత్తీస్‌గఢ్‌పై 44*, చండీగఢ్‌పై 163*, తమిళనాడుపై 111* UPపై 112* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. గతంలో ఈ రికార్డు జేమ్స్ ఫ్రాంక్లిన్ (527) పేరిట ఉంది.
Similar News
News January 5, 2025
ప్రముఖ నటుడికి బ్రెయిన్ సర్జరీ
సినీ నటుడు ప్రభుకు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. డిశ్చార్జ్ అయిన ఆయన ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారని ఆయన PRO వెల్లడించారు. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరగా, మెదడులోని ఓ ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మైనర్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభు తమిళ, తెలుగు, హిందీ, మలయాళంలో కలిపి దాదాపు 220 సినిమాల్లో నటించారు.
News January 5, 2025
సకలశాఖ మంత్రిగా నారా లోకేశ్: తాటిపర్తి
AP: మంత్రి నారా లోకేశ్ సకలశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని YCP నేత తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. విద్యా వ్యవస్థలో లోకేశ్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలని నిలదీశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దోపిడీ పెరిగిపోయింది. కూటమి నేతలు చెప్పే మాటలకు, పనులకు పొంతన ఉందా? ఇప్పటివరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?’ అని ఆయన ప్రశ్నించారు.
News January 5, 2025
ICC ఫైనల్స్: రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా
ICC టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఆస్ట్రేలియా (14) రికార్డు సృష్టించింది. తాజాగా WTC ఫైనల్ చేరుకోవడంతో ఈ ఘనతను సాధించింది. ఈ లిస్టులో రెండో స్థానంలో భారత్ (13), తర్వాతి స్థానాల్లో వరుసగా ENG (9), WI (8), SL (7) ఉన్నాయి. జూన్ 11 నుంచి SAతో జరిగే WTC ఫైనల్లో గెలిస్తే వరుసగా రెండు సార్లు WTC గెలిచిన జట్టుగా ఆసీస్ నిలవనుంది. గత WTC (2021-23) ఫైనల్లో INDపై AUS గెలిచిన సంగతి తెలిసిందే.