News January 3, 2025
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించారు. ఓ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 542 రన్స్ కొట్టిన తొలి ప్లేయర్‌గా ఆయన రికార్డులకెక్కారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆయన వరుసగా ఐదు ఇన్నింగ్సుల్లో నాటౌట్‌గా నిలిచారు. J&Kపై 112*, ఛత్తీస్‌గఢ్‌పై 44*, చండీగఢ్‌పై 163*, తమిళనాడుపై 111* UPపై 112* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. గతంలో ఈ రికార్డు జేమ్స్ ఫ్రాంక్లిన్ (527) పేరిట ఉంది.
Similar News
News January 14, 2025
ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్
ISRO ఛైర్మన్‌గా డా.వి.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మాజీ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో PhD, క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదితో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆదిత్య L1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 వంటి చరిత్రాత్మక ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు.
News January 14, 2025
భారత క్రికెటర్లకు BCCI షాక్?
ఆస్ట్రేలియాతో BGT సిరీస్ వైఫల్యంతో BCCI ప్లేయర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆటతీరు ప్రకారం చెల్లింపులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే వారి సంపాదనలో కోత పడనుంది. ఈ నిర్ణయంతో క్రికెటర్లు అలర్ట్‌గా ఉంటారని కొందరు అంటుంటే.. ఒత్తిడి పెరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది కరెక్టేనా? మీ కామెంట్?
News January 14, 2025
‘గేమ్ ఛేంజర్’ హిందీ కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా హిందీ వెర్షన్‌కు 4 రోజుల్లో ₹29.01కోట్ల వసూళ్లు (నెట్) వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ₹8.64 కోట్లు రాగా, తర్వాతి 3 రోజుల్లో వరుసగా ₹8.43, ₹9.52, ₹2,42 వచ్చినట్లు పేర్కొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా తొలి రోజు ₹186కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందనేది వెల్లడించాల్సి ఉంది.