News February 19, 2025

కశ్మీర్‌కు కరువు ముప్పు: వాతావరణ శాఖ

image

జమ్మూకశ్మీర్‌ కరువు ముప్పు ముంగిట ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడచిన 3 నెలల్లో వర్షపాతం 80శాతం మేర పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో ఎప్పుడూ అనావృష్టి లేదని పేర్కొంది. నదీజలాల స్థాయులు పడిపోయాయని, ప్రజాజీవితాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఈ నెలలో రెండుసార్లు వర్షపాతం పడాల్సి ఉందని, అది పడితే పరిస్థితి కొంత మెరుగవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

Similar News

News April 17, 2026

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం

image

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులోని మంగవారిపేట జంక్షన్ వద్ద గురువారం ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. నగర పర్యాటనకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారు. సీసీ కెమెరా స్తంభాన్ని కూడా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బీచ్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

News April 17, 2026

LIC HFLలో 180 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

image

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. పూర్తి వివరాలకు www.lichousing.com/careers చూడండి.

News April 17, 2026

కేంద్ర మంత్రితో ప్రేమ.. కంగనా రనౌత్ క్లారిటీ!

image

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న రూమర్లపై హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ‘చిరాగ్ నాకు మంచి స్నేహితుడు. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. పదేళ్ల కిందట మేం కలిసి సినిమా చేశాం. ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి మాకు పిల్లలు కూడా ఉండే వారు. ఇన్నేళ్లలో మా బంధంలో ఎలాంటి మార్పు లేదు’ అని చెప్పుకొచ్చారు. కంగనా, చిరాగ్ 2011లో ‘మిలే నా మిలే హమ్’ సినిమాలో కలిసి నటించారు.