News May 7, 2025
కశ్మీరీ పండిట్లు, రైల్వే ఆస్తులే ఉగ్రమూకల లక్ష్యం!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీరీ పండిట్లతోపాటు అక్కడ పనిచేసే స్థానికేతరులు, రైల్వే ఆస్తులను టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అంచనా వేశాయి. పాక్ ISI ఆదేశాలతో దాడులు చేయొచ్చని గుర్తించాయి. ఈ మేరకు ఆయా వర్గాలను, భద్రతా సిబ్బందిని, RPFను అప్రమత్తం చేశాయి. దీంతో రైల్వే సిబ్బంది మార్కెట్లకు వెళ్లొద్దని, తమ బ్యారక్‌ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
Similar News
News March 27, 2026
ఇలా చేస్తే పిల్లలు మొండిగా మారతారు!

మంచి కోసమే అయినా పిల్లల్ని కొన్ని పనులు బలవంతంగా చేయించొద్దు. వారికి నిద్ర చాలా అవసరం. పొద్దున్నే లేవమని ఫోర్స్ చేయొద్దు. బలవంతంగా తినిపించడం వల్ల వారి డైజెషన్ పాడవడమే కాకుండా తిండి అంటేనే భయం పుడుతుంది. పిల్లలతో ఎప్పుడూ సీరియస్‌గా కాకుండా సరదాగా మాట్లాడాలి. వారిని కొట్టడం, తిట్టడం చేస్తే మొండిగా తయారవుతారు. భయం కంటే గౌరవం నేర్పించడం ముఖ్యం. ఇలాంటి చిన్న విషయాలు పాటిస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు.
News March 27, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 27)

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం (ఫొటోలో)
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం
News March 27, 2026
PV సింధు ప్రత్యర్థి కరోలినా మారిన్ రిటైర్మెంట్

బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ 32 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పేశారు. 2016 ఒలింపిక్ ఫైనల్లో PV సింధును ఓడించి గోల్డ్ గెలిచిన ఈ స్పెయిన్ ప్లేయర్ 3 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. 2024 పారిస్ ఒలింపిక్స్ సెమీస్‌లో మోకాలి గాయంతో తప్పుకున్నప్పుడే తాను కోర్టులో రిటైర్ అయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు. ఉమెన్స్ సింగిల్స్‌లో ఒలింపిక్ గోల్డ్ కొట్టిన ఫస్ట్ నాన్ ఏషియన్ షట్లర్‌గా మారిన్ రికార్డ్ క్రియేట్ చేశారు.


