News December 1, 2024

FBI డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్

image

భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు. కశ్యప్ అమెరికాలో అవినీతి నిర్మూలనకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన.. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో పని చేశారు.

Similar News

News December 1, 2024

కోతికి పంది కిడ్నీ.. 6 నెలలు జీవించిన మంకీ

image

చైనా సైంటిస్టులు జన్యుసవరణ చేసిన పంది కిడ్నీని కోతికి అమర్చగా అది 6 నెలలకుపైగా జీవించింది. ఒక జాతి అవయవాలను మరో జాతికి మార్చే పరిశోధనలో ఇది కీలక పురోగతి. గతంలో అమెరికా శాస్త్రవేత్తలు పంది గుండెను మనుషులకూ విజయవంతంగా అమర్చారు. అయితే వారు ఎక్కువ కాలం జీవించలేదు. పంది అవయవాలు హ్యూమన్ ఆర్గాన్స్‌కు సమానమైన పరిమాణంలో ఉంటాయి. దీంతో వీటి అవయవమార్పిడిపై పరిశోధనలు సాగుతున్నాయి.

News December 1, 2024

బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ: అంబటి

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ.. ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ-బాదుడు గ్యారంటీ’ అని రాసుకొచ్చారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపైనా ఆయన సెటైర్లు వేశారు. ‘ప్రతి వైన్ షాపునకూ బెల్ట్ ఉంది.. బాబుకే బెల్ట్ లేదు తీయడానికి!’ అని రాసుకొచ్చారు.

News December 1, 2024

టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే

image

AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.