News March 17, 2024

కాశినాయన: కత్తి పోట్లతో సాధువు మృతి

image

కాశినాయన మండలంలోని నరసాపురంలో అనుమానాస్పద స్థితిలో సాధువు ఆదివారం మృతి చెందడం స్థానికులు గుర్తించారు. నరసాపురం సమీపంలోని అంకాలమ్మ రాతి శిలల సమీపంలో కత్తితో పొడుచుకొని సాధువు మృతిచెందినట్లు స్థానికులు చెప్తున్నారు. జ్యోతి క్షేత్రంలో ఉండే సాధువు శనివారం నరసాపురం ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చూపించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Similar News

News February 8, 2026

గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ కోసం CMకు వినతి

image

గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును శనివారం విజయవాడలో కలిసి విన్నవించినట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తెలిపారు. గాండ్ల సంఘం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని, నూనె తయారీ యూనిట్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.

News February 8, 2026

కడపలో నేడు పోటీలు.. గెలిస్తే రూ.70 వేలు.!

image

కడప నగరంలోని బిల్డప్ దగ్గర కొలువైన పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఐదు బహుమతులు వరకు ఉంటాయన్నారు. ఎద్దుల యజమానులు నిర్దేశించిన సమయంలో అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు.

News February 7, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.16,040
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,757
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.