News January 13, 2025
కౌశిక్ అరెస్ట్.. కరీంనగర్‌కు బీఆర్ఎస్ లీగల్ టీమ్

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు 132, 115(2), 352, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కరీంనగర్‌కు తరలిస్తున్న ఆయనను జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు కౌశిక్ అరెస్ట్ విషయం తెలియగానే బీఆర్ఎస్ లీగల్ టీమ్ కూడా కరీంనగర్ బయల్దేరింది.
Similar News
News February 13, 2025
వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.
News February 13, 2025
విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు

AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
News February 13, 2025
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిదంటే?

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ BJPనే అధికారం చేపడుతుందని INDIA టుడే-Cఓటర్ సర్వే తెలిపింది. BJP ఒంటరిగానే 281 సీట్లు, NDA కూటమి మొత్తంగా 343 స్థానాల్లో జయకేతనం ఎగరవేస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో 232 సీట్లు గెలుపొందిన INDIA కూటమి 188 స్థానాలకు పడిపోతుందని, కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితం కానుందని పేర్కొంది. JAN 2 నుంచి FEB 9 వరకు 1,25,123 మందిపై సర్వే జరిపినట్లు తెలిపింది.