News January 14, 2025

కరీంనగర్‌కు కౌశిక్ రెడ్డి తరలింపు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరికాసేపట్లో ఆయనను జడ్జి ముందే ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు కౌశిక్‌ను అరెస్ట్ చేయడం అక్రమమని హరీశ్ రావు అన్నారు.

Similar News

News February 16, 2025

నీతా అంబానీకి అరుదైన గౌరవం

image

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. దార్శనికత, దాతృత్వం, సామాజిక సేవలతో గ్లోబల్ ఛేంజ్‌మేకర్‌గా నిలుస్తున్నారని USAలోని మసాచుసెట్స్ ప్రభుత్వం కొనియాడింది. విద్య, ఆరోగ్యం, స్పోర్ట్స్, తదితర రంగాల్లో ఆమె సేవలు గొప్పవని పేర్కొంది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ ప్రశంసాపత్రం’ అందజేసింది. బోస్టన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ హీలీ అవార్డ్ అందజేసినట్లు నీతా అంబానీ ఆఫీస్ తెలిపింది.

News February 16, 2025

BIG BREAKING: IPL-2025 షెడ్యూల్ వచ్చేసింది

image

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2025 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి 65 రోజులపాటు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్‌ KKR-RCB మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహిస్తారు. 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. IPL షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 16, 2025

ప్రతి ఎన్నికలో గెలవాల్సిందే: సీఎం చంద్రబాబు

image

AP: ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల కూటమి నేతలతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో TDP అభ్యర్థులు ఘన విజయం సాధించేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఎన్నికా పరీక్షేనని, అన్నిట్లోనూ గెలవాలని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి పాలనలో స్పష్టమైన మార్పులు తెచ్చామన్నారు.

error: Content is protected !!