News August 27, 2024
కవిత బెయిల్: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అప్రూవర్‌గా మారి చెప్పిన విషయాలపైనే దర్యాప్తు సంస్థలు ఆధారపడొద్దు. మీరు న్యాయంగా ఉండాలి. స్కామ్‌లో భాగమయ్యానని చెప్పిన వ్యక్తినే అఫ్రూవర్‌గా చేశారు. సాక్ష్యులను సెలక్టివ్‌గా నిర్ణయించడం సరికాదు. వారిచ్చిన స్టేట్‌మెంట్లపై కూడా బలమైన సాక్ష్యాలుండాలి’ అని స్పష్టం చేసింది.
Similar News
News September 14, 2024
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత జట్టు చిత్తుగా ఓడించింది. వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత్ నామమాత్రపు మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయడంతో భారత్ 2-1 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
News September 14, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం: గంటా
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి సెంటిమెంట్ అని MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ఆత్మాభిమానాలతో ముడిపడి ఉంది. ప్రైవేటీకరణ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కచ్చితంగా కాపాడుకుంటాం. ప్రైవేటీకరణను అడ్డుకోవడం YCP వల్ల కాలేదు. పక్క రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల కోసం సీఎంలు స్వయంగా రోడ్లపైకి వచ్చారు. దీంతో ప్రైవేటీకరణ యోచనను కేంద్రం మానుకుంది’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
News September 14, 2024
కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 20న విధివిధానాలు?
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.