News August 28, 2024

హైదరాబాద్‌కు కవిత.. 500 కార్లతో భారీ ర్యాలీ

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వస్తున్న సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో భాగంగా తన తండ్రి కేసీఆర్‌తో కవిత భేటీ అవుతారు. ఆ తర్వాత తిరిగి ఆమె నివాసానికి చేరుకుంటారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి ఆమె హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

Similar News

News September 17, 2024

జానీని ‘మాస్టర్’ అని పిలవొద్దు: హీరోయిన్

image

డాన్స్ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఆయన తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News September 17, 2024

నేడు సమీక్షలతో బిజీగా సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీ, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

News September 17, 2024

మోదీ @ 74: పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

image

ప్రధాని నరేంద్రమోదీ నేడు 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయా రాష్ట్రాల CMలు, కేంద్ర మంత్రులు, BJP నేతలు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘భరతమాత ముద్దుబిడ్డ, విజనరీ లీడర్, పీఎం మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. బలమైన, సంపన్నమైన భారత్‌ను నిర్మించాలన్న మీ విజన్ అందరి హృదయాల్లో ధ్వనిస్తోంది. అంకితభావంతో దేశాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు ప్రేరణనివ్వాలి’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.