News March 18, 2024

సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్

image

TS: BRS ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన ప్రమేయం లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తన ప్రమేయంపై ఆధారాలు లేవని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

Similar News

News February 8, 2026

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలోని మలుపువద్ద ఉన్న స్తంభాన్ని బైక్‌ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ముసినేని మురళి (41) మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. ఆదివారం మృతిడి భార్య సరోజిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు.

News February 8, 2026

వచ్చే సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-3

image

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ 2016 సంక్రాంతికి విడుదలై హిట్టయిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌ ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్య నటించారు. ఆ మూవీ 2022 సంక్రాంతికి రిలీజై ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మూడో పార్ట్ రానుంది. ‘వాసివాడి తస్సాదియ్యా.. 2027 JAN 15న సోగ్గాళ్లు వస్తే పండగ కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా’ అని అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది.

News February 8, 2026

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>చెన్నై <<>>మెట్రో రైల్ లిమిటెడ్ 19 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.62,000 నుంచి రూ.2,70,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://chennaimetrorail.org