News November 15, 2024

సమగ్ర కుటుంబ సర్వేలో కవిత(PHOTOS)

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు ఇవాళ హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ సిబ్బందికి తమ పూర్తి వివరాలు ఇచ్చారు. కొన్ని వివరాలను కవితనే స్వయంగా నమోదు చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చిన కవిత చాలారోజుల తర్వాత బయటి ప్రపంచానికి కనిపించారు.

Similar News

News November 24, 2025

విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 24, 2025

మెనోపాజ్‌లో ఎముకలు జాగ్రత్త

image

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ స్థితి ఒకటి. అయితే ఈ క్రమంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, డి విటమిన్‌ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మెనోపాజ్‌ దశలో స్త్రీలు తమ రోజువారీ ఆహారంలో సుమారు 1200 మి.గ్రా క్యాల్షియంను అదనంగా తీసుకోవాలి. అలానే, పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే డైట్‌ని తీసుకోవాలంటున్నారు.

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.