News March 17, 2024
కవిత అక్రమార్జన రూ.192.8కోట్లు: ED
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన కుట్రదారుల్లో ఎమ్మెల్సీ కవిత ఒకరని పేర్కొన్న ఈడీ.. ఆమె రూ.192.8కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కస్టడీ పిటిషన్లో పేర్కొంది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు రూ.100కోట్లు ఆప్ నేతలకు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత మనీ లాండరింగ్కు పాల్పడినట్లు నిర్ధారించిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది.
Similar News
News December 26, 2024
కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?
TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.
News December 26, 2024
బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.
News December 26, 2024
సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం
TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.