News March 17, 2024

కవిత అక్రమార్జన రూ.192.8కోట్లు: ED

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన కుట్రదారుల్లో ఎమ్మెల్సీ కవిత ఒకరని పేర్కొన్న ఈడీ.. ఆమె రూ.192.8కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు రూ.100కోట్లు ఆప్ నేతలకు లంచం ఇచ్చినట్లు వెల్లడించింది. కవిత మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించిన తర్వాతే ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది.

Similar News

News December 5, 2024

UAN యాక్టివేషన్ గడువు పొడిగింపు

image

కేంద్రం తీసుకొచ్చిన ELI పథకం ప్ర‌యోజ‌నాల కోసం ఆధార్ అనుసంధాన UAN యాక్టివేషన్ గడువును EPFO పొడిగించింది. నవంబర్ 30తోనే డెడ్‌లైన్ ముగియగా దాన్ని డిసెంబర్ 15 వరకు పెంచింది. ఈ స్కీం ద్వారా ఉద్యోగుల‌కు 3 విడ‌త‌ల్లో రూ.15 వేల వ‌ర‌కు సాయం అందుతుంది. ఉద్యోగికి, యజమానికి ప్రోత్సాహకాలు, ప్రతి కొత్త ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేల వరకు కేంద్రం ఇస్తుంది.

News December 5, 2024

పవర్ గ్రిడ్ పతనం.. క్యూబాలో అంధకారం

image

క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం అలుముకుంది. దీంతో దేశంలోని పాఠశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతపడ్డాయి. దేశంలోని లక్షలాది మంద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక జనం అల్లాడుతున్నారు. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు మూగబోవడంతో దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు. కాగా గ్రిడ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ విద్యుత్‌శాఖ మంత్రి విసెంటే డి లా ఒలెవీ తెలిపారు.

News December 5, 2024

చైనాతో చేతులు కలిపిన నేపాల్

image

చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI)లో భారత పొరుగు దేశం నేపాల్ చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం నేపాల్ ప్రధాని న్యూఢిల్లీకి వచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి పీఎం కేపీ ఓలి శర్మ తాజాగా బీజింగ్ వెళ్లారు. సోమవారం నుంచీ అక్కడే ఉంటూ బీఆర్ఐలో చేరే ప్రక్రియపై చర్చలు జరిపారు. తాజాగా ఆ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు నేపాల్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.