News March 18, 2024
నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కవిత భర్త!
TS: MLC కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు KTR, హరీశ్‌రావు కలిశారు. ఇవాళ పలువురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది కలిసే అవకాశం ఉంది.
Similar News
News October 13, 2024
బాహుబలి-2ను దాటేసిన దేవర
తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్‌లో బాహుబలి-2 రూ.3.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. ఆ రికార్డును ఎన్టీఆర్ ‘దేవర’ దాటేసింది. 16వ రోజున రూ.3.65కోట్లు వసూలు చేసింది. ఈ జాబితాలో తర్వాతి మూడు స్థానాల్లో హను-మాన్(రూ.3.21కోట్లు), RRR (రూ.3.10కోట్లు), F2(రూ.2.56 కోట్లు) ఉన్నాయి. గత నెల 27న విడుదలైన ‘దేవర’ తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
News October 13, 2024
ఉపాధి హామీ పనుల ప్రభావంపై అధ్యయనం
క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం పనితీరు, దాని ప్రభావంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయనానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ దశల్లో కన్సల్టెంట్లను ఎంపిక చేస్తారు. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే ద్వారా గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనుల ప్రభావంపై కన్సల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
News October 13, 2024
2025లో మెగా అభిమానులకు పండుగే పండుగ!
2025 మెగా అభిమానులకు కనుల పండుగ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సినిమాలు నెలల వ్యవధిలో రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. జనవరి 10న చెర్రీ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా, మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, చిరు విశ్వంభర కూడా ఏప్రిల్‌లో రిలీజయ్యే ఛాన్సుంది.