News May 19, 2024

రేపటితో ముగియనున్న కవిత రిమాండ్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన BRS MLC కవిత జుడీషియల్ రిమాండ్ రేపటితో ముగియనుంది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. కవిత కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ, సీబీఐ వేసిన పిటిషన్లపై మ.2 గంటలకు విచారణ జరగనుంది. కాగా మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Similar News

News December 11, 2024

ట్రంప్‌కు కాబోయే కోడలికి కీలక పదవి

image

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే కోడలికి కీలక పదవి కట్టబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫియాన్సీ కింబర్లీ గిల్ఫోయిల్‌ను గ్రీస్‌కు US రాయబారిగా నియమించారు. కింబర్లీ గతంలో ఫాక్స్ న్యూస్ హోస్ట్‌గా పనిచేశారు. 2020లో ట్రంప్ జూనియర్‌తో నిశ్చితార్థం జరిగింది. కాగా జూనియర్ ట్రంప్‌ ఇప్పటికే వానెసాతో పెళ్లై విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు.

News December 11, 2024

GOOGLE: ప్రపంచంలో రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా GOOGLE అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.

News December 11, 2024

చట్టం వారికే చుట్టమా! భార్యా బాధితులకు లేదా రక్షణ?

image

క్రూరత్వం, గృహహింస నుంచి రక్షణగా స్త్రీల కోసం తెచ్చిన చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భార్య పెట్టిన తప్పుడు కేసులతో పడలేక, చట్టంతో పోరాడలేక నిన్న బెంగళూరు <<14841616>>టెకీ<<>> ప్రాణాలు విడిచిన తీరు కలతపెడుతోంది. చట్టాల్లోని కొన్ని లొసుగులను కొందరు స్త్రీలు ఆస్తి, విడాకుల కోసం వాడుకుంటున్న తీరు విస్మయపరుస్తోంది. ఇలాంటి ట్రెండు ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టూ చెప్పడం గమనార్హం.