News February 6, 2025
మరో టీమ్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్
సన్ గ్రూప్ వారసురాలు కావ్యా మారన్ మరో క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేశారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో Northern సూపర్ ఛార్జెస్ ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, SA20లో ఈస్ట్రర్న్ కేప్ టౌన్ టీమ్‌లకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్‌ను MI, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును LSG కొనుగోలు చేశాయి.
Similar News
News February 6, 2025
రుణం కంటే రెట్టింపు వసూలు.. విజయ్ మాల్యా పిటిషన్
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.6,200 కోట్ల అప్పునకు బ్యాంకులు రూ.14,131 కోట్ల ఆస్తులను రికవరీ చేశాయని తెలిపారు. అయినా ఇంకా జప్తు కొనసాగుతోందని, దీనిపై స్టే విధించాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13లోగా స్పందించాలని న్యాయస్థానం 10 బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది.
News February 6, 2025
ఎండాకాలం వచ్చేసింది
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి వేడి పెరిగింది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మంగళవారం రికార్డు స్థాయిలో 15,582 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది అదేరోజు 13,276 మెగావాట్ల వినియోగం నమోదవడం గమనార్హం. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు ఉంటున్నాయి. మరో వారంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News February 6, 2025
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 21,45,330 మందికి ₹1,126Cr జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి ₹6K చొప్పున లబ్ధి చేకూర్చినట్లు తెలిపింది. త్వరలోనే 2, 3 ఎకరాల రైతులకు నిధులు జమ చేస్తామంది. కాగా MLC ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్‌గోయింగ్ స్కీమ్ కింద ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. మరి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?