News March 11, 2025
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 65% పూర్తి: కిషన్ రెడ్డి

TG: హన్మకొండ(D) కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు పనులు 65% పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు రివైజ్డ్ బడ్జెట్ రూ.716 కోట్లు అని పేర్కొన్నారు. 160 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఏడాదికి 2,400కు పైగా వ్యాగన్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో షేర్ చేశారు.
Similar News
News March 24, 2025
ఆందోళన వద్దు.. ఆదుకుంటాం: సీఎం

AP: అకాల వడగండ్ల వర్షాల కారణంగా పంట నష్టపోయి అనంతపురం(D)లో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. ప్రస్తుతం వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు. వర్షాలకు 4 జిల్లాల్లో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ పరంగా వారికి సాయం అందించాలని CM ఆదేశించారు. నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందొద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
News March 23, 2025
కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు: KTR

TG: ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా CM రేవంత్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండేదని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే అని ఆరోపించారు.
News March 23, 2025
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు

రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(18) డకౌటైన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా(16) ఉన్నారు. ఇవాళ చెన్నైతో మ్యాచ్‌లో 4 బాల్స్ ఆడిన హిట్ మ్యాన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లారు.