News April 27, 2024
కేసీఆర్.. మీరా మమ్మల్ని ప్రశ్నించేది?: పొన్నం
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కామ్‌లో జైలుకు పోయింది. ఆయన నిర్మించిన కాళేశ్వరం కుంగింది. ఇప్పుడొచ్చి ప్రభుత్వాన్ని కూలగొడతానంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూమిలాంటి ఎన్నో హామీలను నెరవేర్చని మీరా మమ్మల్ని ప్రశ్నించేది? మాది మీలా నియంతృత్వ సర్కారు కాదు. ప్రజా ప్రభుత్వం’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 6, 2024
చావును దాటి వైట్‌హౌస్‌పై జెండా ఎగరేసి..
US ఎన్నికల్లో విజయానికి ముందు డొనాల్డ్ ట్రంప్ అష్టకష్టాలు పడ్డారు. కోర్టుల్లో చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఎన్నికల్లో అసలు పోటీచేయకుండా కుట్రలు జరిగాయి. ఫెడరల్ కోర్టు దానిని కొట్టేసి మార్గం సుగమం చేసింది. ఆ తర్వాత పెన్సిల్వేనియా కాల్పుల్లో వెంట్రుకవాసిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. మరోసారి గోల్ఫ్ కోర్ట్ వద్ద కాల్పులు జరిగాయి. చివరికి అన్నీ దాటుకొని వైట్‌హౌస్‌లో అడుగు పెడుతున్నారు.
News November 6, 2024
విజయనగరం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ
AP: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు బరిలో ఉన్నట్లు తెలిపింది. కాగా ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. అంతకుముందు రఘురాజుపై అనర్హత వేటుతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
News November 6, 2024
వర్రా రవీంద్రను వదిలేయడంపై సీఎం సీరియస్
AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి 41ఏ నోటీసులిచ్చి పోలీసులు వదిలేయడంపై సీఎం చంద్రబాబు, డీజీపీ తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీతో కర్నూలు రేంజ్ DIG సమావేశమై రవీంద్ర కేసుపై చర్చించారు. మరో కేసులో రవీంద్రాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ వర్రాపై మంగళగిరి, HYDలో కేసులున్నాయి.