News April 9, 2024
15 తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర?
TG: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15 తర్వాత ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బహిరంగసభలకు బదులు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి యాత్రను ప్రారంభిస్తారని సమాచారం. కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు.
Similar News
News January 12, 2025
మాంజాపై నిషేధాన్ని అమలు చేయండి: హైకోర్టు
TG: గాలిపటాలకు నైలాన్ దారాలను లేదా మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటి విక్రయాన్ని నిషేధిస్తూ 2017లో NGT ప్రధాన బెంచ్ వెల్లడించిన తీర్పును అమలు చేయాలని పేర్కొంది. ఉత్తర్వుల అమలుపై వివరాలు సమర్పించాలని హోం, అటవీ, పర్యావరణ శాఖల సీఎస్‌లకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
News January 12, 2025
రిపబ్లిక్ డే పరేడ్‌కు రాష్ట్రం నుంచి 41 మంది
TG: న్యూఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించే గణతంత్ర వేడుకలకు 41 మంది రాష్ట్ర వాసులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పరేడ్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా రాజేశ్వర్ ఉండనుండగా ట్రెయినీ డీజీటీ శ్రావ్యతో పాటు మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
News January 12, 2025
నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.