News April 25, 2024
ఇవాళ్టి నుంచి KCR బస్సు యాత్ర

TG: ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, నల్గొండ మీదుగా సాయంత్రం మిర్యాలగూడలో రోడ్ షో చేస్తారు, రాత్రి సూర్యాపేట రోడ్‌షోలో ప్రసంగిస్తారు. మొత్తం 17 రోజులపాటు యాత్ర కొనసాగిస్తారు. మే 10 సిద్దిపేటలో బహిరంగసభతో ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. కాగా రోజూ ఉదయం పొలం బాట, సాయంత్రం 2-3 ప్రాంతాల్లో రోడ్ షోలు ఉండనున్నాయి.
Similar News
News March 15, 2026
ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.
News March 15, 2026
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.
News March 15, 2026
పిల్లలకు ఈ పోషకాలు తప్పక ఇవ్వండి

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.


