News April 25, 2024

ఇవాళ్టి నుంచి KCR బస్సు యాత్ర

image

TG: ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, నల్గొండ మీదుగా సాయంత్రం మిర్యాలగూడలో రోడ్ షో చేస్తారు, రాత్రి సూర్యాపేట రోడ్‌షోలో ప్రసంగిస్తారు. మొత్తం 17 రోజులపాటు యాత్ర కొనసాగిస్తారు. మే 10 సిద్దిపేటలో బహిరంగసభతో ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. కాగా రోజూ ఉదయం పొలం బాట, సాయంత్రం 2-3 ప్రాంతాల్లో రోడ్ షోలు ఉండనున్నాయి.

Similar News

News January 16, 2025

హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు

image

ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

News January 16, 2025

కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్

image

హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.

News January 16, 2025

ఆరు వారాలే ఒప్పందం!

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.