News January 30, 2025
కుంభమేళా బాధితులకు కేసీఆర్ సంతాపం

TG: కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారని, సరైన ఏర్పాట్లు కల్పించి, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Similar News
News January 20, 2026
మూవీ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

TG: సినిమా టికెట్ ధరల <<18819916>>పెంపుపై<<>> తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. MSVPG టికెట్ ధరల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయమై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, <<18817219>>సీవీ ఆనంద్<<>>కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇకపై మూవీ టికెట్ ధరల పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
News January 20, 2026
రోహిత్, కోహ్లీకి బీసీసీఐ షాక్ ఇవ్వనుందా?

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో BCCI కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వార్షిక కాంట్రాక్టుల్లో టైర్-2కు డిమోట్ చేయనుందని సమాచారం. 4 టైర్ రిటైనర్షిప్ సిస్టమ్ నుంచి A+ క్యాటగిరీని తొలగించాలని అగార్కర్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలిసిందని India Today పేర్కొంది. A+ ఆటగాళ్లకు ₹7 కోట్లు, A-₹5 కోట్లు, B-₹3 కోట్లు, C- ₹1 కోటిని BCCI చెల్లిస్తోంది.
News January 20, 2026
ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ: కేటీఆర్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో చేస్తుంది సిట్ విచారణ కాదని చిట్టి విచారణ అని కేటీఆర్ విమర్శలు చేశారు. ఇదో లొట్ట పీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలను విచారణ, కమిషన్ల పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తన బురదను అందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడుతున్నారన్నారు. నైనీ బ్లాక్ రద్దు వెనక వాటాల పంచాయితీ ఉందని ఫైరయ్యారు.


