News January 30, 2025
కుంభమేళా బాధితులకు కేసీఆర్ సంతాపం

TG: కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారని, సరైన ఏర్పాట్లు కల్పించి, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Similar News
News February 19, 2025
కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయి, రెడీగా ఉండండి: కేసీఆర్

TG: రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని వ్యాఖ్యానించారు.
News February 19, 2025
నిద్ర చెడగొడుతోందని కోడిపై RDOకు ఫిర్యాదు..

పొద్దున 3 గంటలకు అదే పనిగా కూస్తోందని కేరళ, పల్లిక్కల్ వాసి రాధాకృష్ణ కురూప్ ఓ కోడిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా నిద్రను చెడగొడుతూ ప్రశాంతమైన తన జీవితానికి భంగం కలిగిస్తోందని ఆయన స్థానిక RDOకు మొరపెట్టుకున్నారు. దానిని సీరియస్‌గా తీసుకున్న అధికారి వెంటనే ఇంటికొచ్చి పరిశీలించారు. పక్కింటి మేడపై కోళ్ల షెడ్డును గమనించి దానిని 14 రోజుల్లో మరోచోటకు మార్చాలని ఆదేశించారు.
News February 19, 2025
త్వరలో.. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంపు!

బ్యాంకు కస్టమర్లకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.8-12 లక్షలకు పెంచబోతోందని సమాచారం. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తోందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది. ఈ నెలాఖరు నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రావొచ్చని పేర్కొంది. ఫిక్స్‌డ్, సేవింగ్స్, కరెంట్, రికరింగ్ A/Cకు ఇవి వర్తిస్తాయంది.