News April 10, 2024

ఈనెల 13 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

image

TG: BRS అధ్యక్షుడు, మాజీ సీఎం KCR ఈనెల 13న చేవెళ్ల సభ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారట. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా బస్సు యాత్ర ఉండనుందట. మరోవైపు వరంగల్ ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News December 1, 2025

‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

image

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.

News December 1, 2025

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

image

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్ పాక్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్‌లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్‌ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్‌తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.

News December 1, 2025

పురుషులు, స్త్రీలు ఎంత నీరు తాగాలంటే?

image

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. US అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ ప్రకారం పురుషులు రోజుకు 3.7లీటర్లు, స్త్రీలు 2.7లీటర్ల మేర నీరు సేవించాలంటున్నారు. వయసు, బరువు, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి మారుతాయని, గర్భిణులు & పాలిచ్చే తల్లులు నీటిని ఎక్కువ సేవించాలని చెబుతున్నారు. తక్కువ నీరు తాగితే ‘హైడ్రేషన్’, ఎక్కువ సేవిస్తే ‘హైపోనాట్రేమియా’ సమస్యలొస్తాయంటున్నారు.