News April 10, 2024
ఈనెల 13 నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

TG: BRS అధ్యక్షుడు, మాజీ సీఎం KCR ఈనెల 13న చేవెళ్ల సభ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారట. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా బస్సు యాత్ర ఉండనుందట. మరోవైపు వరంగల్ ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News March 26, 2025
సూసైడ్ చేసుకుంటానని భర్తను బెదిరించడం క్రూరత్వమే: హైకోర్టు

సూసైడ్ చేసుకుంటానంటూ భర్తను, అతడి కుటుంబాన్ని భార్య బెదిరించడం క్రూరత్వం కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్య అలా చేస్తే భర్త విడాకులు తీసుకోవడంలో తప్పేం లేదని తేల్చిచెప్పింది. భార్య సూసైడ్ పేరిట తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త దిగువ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. కోర్టు మంజూరు చేయగా భార్య హైకోర్టుకెళ్లారు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.
News March 26, 2025
రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం

రష్యా, ఉక్రెయిన్ కీలక ఒప్పందానికి వచ్చాయి. చమురు కర్మాగారాలు, రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లు తదితర ఇంధన ఉత్పత్తి ప్రాంతాలపై దాడి చేసుకోరాదని అంగీకరించాయి. ఓ ప్రకటనలో రష్యా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది 30 రోజుల కోసం చేసుకున్న తాత్కాలిక ఒప్పందమేనని, పరస్పర అంగీకారంతో మరింత పొడిగించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు దేశాల్లో ఎవరు ఈ అంగీకారాన్ని ఉల్లంఘించినా ఒప్పందం రద్దవుతుందని వివరించింది.
News March 26, 2025
జాగ్రత్త.. ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. !

ఉదయాన్నే నిద్ర లేవగానే చాలా నీరసం, కళ్లు తిరిగినట్లు అనిపించడం, రాత్రంతా పలుమార్లు మూత్రవిసర్జనకోసం లేవాల్సి రావడం, నాలుక-పెదాలు మాట్లాడలేనంతగా తడారిపోవడం, టైమ్‌కి తినకపోతే శరీరం వణుకు రావడం.. ఇవన్నీ షుగర్ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.