News April 18, 2024
ఈసీని వారం గడువు కోరిన KCR
TG: ఈసీ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు వారం గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల పర్యటనలో తమ నేతలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఇవాళ ఉ.11 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎంకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది.
Similar News
News September 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 9, 2024
శుభ ముహూర్తం
తేది: సెప్టెంబర్ 09, సోమవారం
షష్ఠి: రా.9.53 గంటలకు
విశాఖ: సా.6.04 గంటలకు
వర్జ్యం: రా.10.24-రా.12.08 గంటల వరకు
దుర్ముహూర్తం: తెల్లవారుఝామున.12.26- 1.18 గంటల వరకు
మ.2.56-3.45 గంటల వరకు
News September 9, 2024
లైంగిక దాడులు చేసేవారిపై తీవ్ర చర్యలు: విశాల్
తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు ఒడిగట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ తెలిపారు. ఈ మేరకు నేడు జరిగిన సంఘం 68వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించామని తెలిపారు. ‘సంఘం ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసింది. ఫిర్యాదు వస్తే తప్పు చేసినవారిపై తీవ్ర చర్యలుంటాయి’ అని వివరించారు. మహిళలకు ధైర్యాన్నిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామని సంఘం ట్రెజరర్ నాజర్ పేర్కొన్నారు.