News April 25, 2024

డిప్రెషన్‌లో కేసీఆర్: మంత్రి ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ డిప్రెషన్‌లో అలా మాట్లాడరన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. రేవంత్ నాయకత్వంలో విన్నింగ్ టీమ్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్‌కు గత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

Similar News

News December 7, 2025

సంకటహర చతుర్థి ప్రత్యేకత ఏంటంటే?

image

ఇవాళ వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ‘ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు చతుర్థి ప్రారంభమయ్యి సోమవారం సాయంత్రం 4.03 గంటలకు ముగుస్తుంది. ఈరోజు వినాయకుడిని గరికతో పూజించడం విశేషం. చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేసుకోవడం శుభప్రదం. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథిరోజు 3, 5, 11, 21 నెలలపాటు ఆచరించాలి. దీనిని బహుళ చవితి రోజు ప్రారంభించాలి’ అని పండితులు చెబుతున్నారు.

News December 7, 2025

ఈ ఆలయాలకు వెళ్తే..

image

మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ శని దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో ఇళ్లు, షాపులకు తలుపులు ఉండవు. న్యాయాధిపతి శని దేవుడి మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. శని ధామ్(ఢిల్లీ), కోకిలవ ధామ్(UP), తిరునల్లార్(తమిళనాడు) ఆలయాలను దర్శించడం వల్ల కూడా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News December 7, 2025

కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

image

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్‌లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.