News April 5, 2024
కరీంనగర్‌లో ఎండిన పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్
TG: ఉమ్మడి కరీంనగర్ పర్యటనలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ముగ్దంపూర్‌లో ఎండిన పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో ఆయన మాట్లాడారు. నీటి సమస్యపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం బోయినపల్లిలో పంట పొలాల పరిశీలనకు పయనమయ్యారు. ఆ తర్వాత మధ్య మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు.
Similar News
News January 23, 2025
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు అందులోకి పోర్ట్ అయ్యారు. ఆఫర్లు బాగున్నా సిగ్నల్ చాలా ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో BSNL కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేలకు పైగా 4G టవర్లు పని చేస్తున్నాయని పేర్కొంది. జూన్ వరకు వీటిని లక్షకు పెంచుతామని తెలిపింది.
News January 23, 2025
‘త్వరగా రావే.. టైమ్ అవుతోంది’
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితి ఇది. చాలా స్కూళ్లలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఇలా ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకటే టాయిలెట్ ఉంటోంది. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. HYDలోని ఓ పాఠశాలలోని పరిస్థితి తెలియజేస్తూ ఓ జర్నలిస్టు తీసిన ఫొటో వైరలవుతోంది. దీనిపై మీ కామెంట్?
News January 23, 2025
ఈ కారణాలతోనే రిజైన్ చేస్తుంటారు: గోయెంకా
ఉద్యోగుల రాజీనామాలకు గల కారణాలను బిజినెస్‌మ్యాన్ హర్షా గోయెంకా తెలిపారు. రీజన్స్ ఇవేనంటూ ఓ ఫొటో షేర్ చేశారు. ‘సరైన మేనేజర్ లేకపోవడం, సమానంగా చూడకపోవడం, గుర్తింపు లేకపోవడం, తక్కువ జీతం ఇవ్వడం, విష సంస్కృతి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, ఎదిగేందుకు తక్కువ ఆప్షన్స్ ఉండటం, ఆఫీస్‌లో జరిగే రాజకీయాలకు బలవడం, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, వర్క్ లోడ్ ఎక్కువ చేయడం వంటివి కారణాలు కావొచ్చు’ అని తెలిపారు.