News April 4, 2024
ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ప్రమేయం ఉంది: కిషన్ రెడ్డి

TG: BRS హయాంలో ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో BJP నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబీకుల ప్రమేయం ఉంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Similar News
News December 9, 2025
వాజ్పేయి పాలసీలతో అభివృద్ధికి పునాది: CM

AP: ఈనెల 11-25 మధ్య జరిగే ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్ర’లో కూటమి నేతలంతా పాల్గొనాలని CM CBN సూచించారు. వాజ్పేయి సుపరిపాలనకు నాంది పలికారని, ఆయన పాలసీలతోనే దేశాభివృద్ధికి పునాది పడిందని చెప్పారు. రోడ్లు, విమానయాన, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించేవారన్నారు. PM మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
News December 9, 2025
NIT వరంగల్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)వరంగల్లో 3పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, B.Sc( Food Tech), MSc( Food Tech), BA/BSc(సైకాలజీ)లేదా MA/MSc(సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PWBDలకు రూ.300. షార్ట్లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitw.ac.in/
News December 9, 2025
సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్లో ఇండియన్ సిటిజన్షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.


