News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ ప్రమేయం ఉంది: కిషన్ రెడ్డి

image

TG: BRS హయాంలో ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించివేశారని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘దుబ్బాక, మునుగోడు ఉపఎన్నికల్లో BJP నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబీకుల ప్రమేయం ఉంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను వాడుకున్నారు’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Similar News

News April 25, 2025

నేటి నుంచి స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తులు

image

AP: స్పౌజ్ పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పింఛన్ ఇవ్వనుంది. ఇందుకు ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయల్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 30లోపు వివరాలు సమర్పిస్తే మే 1 నుంచి దాదాపు 89వేల మందికి కొత్తగా పెన్షన్ అందనుంది.

News April 25, 2025

బొట్టు తీసేసినా వదల్లేదు.. చంపేసి నవ్విన ఉగ్రఘాతకులు

image

పహల్గామ్‌లో అమాయకులను కాల్చి చంపిన టెర్రరిస్టుల దురాగతాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తమ నుదుటిన బొట్టు తీసేసి, అల్లాహు అక్బర్ అని నినాదాలు చేసినా తన భర్త కౌస్తుభ్ గన్బోటేను చంపేశారని సంగీత(పుణే) కన్నీటిపర్యంతమయ్యారు. తర్వాత చిన్ననాటి స్నేహితుడు సంతోష్‌నూ కాల్చేశారని చెప్పారు. తన భర్త శైలేష్‌తో సహా ముగ్గురిని చంపేసి ఉగ్రవాదులు పగలబడి నవ్వారని శీతల్‌బెన్(అహ్మదాబాద్) రోదించారు.

News April 25, 2025

నేటి నుంచి భారత్ సమ్మిట్

image

TG: నేటి నుంచి హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు భారత్ సమ్మిట్ జరగనుంది. ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ థీమ్‌తో జరిగే సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదించడంతో పాటు ఒక తీర్మానం పాస్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ కాన్సెప్ట్‌ను ఈ వేదిక నుంచి ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం చూస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు.

error: Content is protected !!