News February 19, 2025
KCR పగటి కలలు కంటున్నారు: మంత్రి

TG: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని <<15513169>>KCR<<>> పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనపడుతుందని ప్రశ్నించారు. ‘KCRకు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజలు కష్టపడి ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజా తీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు రాలేదు’ అని విమర్శించారు.
Similar News
News November 21, 2025
OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్గా పంత్

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
News November 21, 2025
మిస్ యూనివర్స్-2025 ఫాతిమా బాష్ గురించి తెలుసా?

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. స్కూల్లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్యాక్టివిటీ డిజార్డర్తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్గా నిలిచారు.


