News March 28, 2024

కేకే తీరుపై కేసీఆర్ అసహనం

image

TG: ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో BRS అధినేత కేసీఆర్‌తో సీనియర్ నేత కె.కేశవరావు భేటీ ముగిసింది. పార్టీ మార్పు అంశాన్ని కేసీఆర్‌కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదు. పార్టీలో మీకు ఏం తక్కువ చేశాం? మీ ఆలోచన చాలా తప్పు. మీరే ఆలోచించుకోండి’ అని సూచించారు. కానీ తాను కాంగ్రెస్‌లో చేరి, అక్కడే చనిపోతానని కేకే చెప్పారు.

Similar News

News April 11, 2026

మరికొన్ని గంటల్లో భూమిపైకి ఆర్టెమిస్-2

image

నాసా ప్రయోగించిన <<19586985>>ఆర్టెమిస్-2<<>> మరికొన్ని గంటల్లో భూమిపైకి చేరుకోనుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో వ్యోమగాముల క్యాప్సూల్ ల్యాండ్ అవ్వనుంది. భారత కాలమాన ప్రకారం రేపు తెల్లవారుజామున 5.37 గంటలకు ఈ అద్భుత ఘట్టం చోటు చేసుకోనుంది. భూమి నుంచి 4,06,773KM దూరానికి చేరుకొని అత్యంత సుదూర మానవ సహిత అంతరిక్ష యాత్రగా ఆర్టెమిస్-2 నిలిచింది.

News April 11, 2026

గ్యాస్ లేకుండానే మంట.. ‘ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్’

image

గ్యాస్ అవసరం లేకుండానే మంటను పుట్టించే ‘ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్’ మార్కెట్లోకి వస్తోంది. ఇది విద్యుత్ ద్వారా గాలిని అయనీకరణం చేసి 1300°C వరకు వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇండక్షన్‌ స్టవ్‌లా కాకుండా దీనిపై అన్ని రకాల గిన్నెలు వాడుకోవచ్చు. గ్యాస్ లీకేజీ భయం ఉండదు. సౌర విద్యుత్ వాడేవారికి మరింత లాభదాయకం. సుమారు రూ.35,000 ధర ఉండే ఈ స్టవ్ భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయం కానుంది.

News April 11, 2026

పాలు Vs గుడ్లు.. విటమిన్-Dకి ఏది బెస్ట్?

image

భారత్‌లో 67% మంది విటమిన్-D లోపంతో బాధపడుతున్నారు. దీనికోసం అదనపు విటమిన్ కలిపిన పాలు (Fortified Milk), కోడిగుడ్డు సొన ప్రధాన ఆహార వనరులు. పరిమాణ పరంగా పాలల్లో విటమిన్-D ఎక్కువగా ఉన్నా గుడ్డు సొనలో ఉండే ‘D3’ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే ఈ లోపాన్ని భర్తీ చేయలేమని, రోజూ ఎండ తగిలేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల బలం, రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆహారం, ఎండ రెండూ అవసరం.