News March 28, 2024
కేకే తీరుపై కేసీఆర్ అసహనం

TG: ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో BRS అధినేత కేసీఆర్‌తో సీనియర్ నేత కె.కేశవరావు భేటీ ముగిసింది. పార్టీ మార్పు అంశాన్ని కేసీఆర్‌కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదు. పార్టీలో మీకు ఏం తక్కువ చేశాం? మీ ఆలోచన చాలా తప్పు. మీరే ఆలోచించుకోండి’ అని సూచించారు. కానీ తాను కాంగ్రెస్‌లో చేరి, అక్కడే చనిపోతానని కేకే చెప్పారు.
Similar News
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.


