News July 31, 2024
కేసీఆర్‌కు బాధ్యత లేదు.. మీడియా చిట్‌చాట్‌లో రేవంత్
TG: అధికారం లేకపోతే ప్రజలు కూడా అవసరం లేదన్నట్టు కేసీఆర్ వైఖరి ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ అన్నారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? అధికార పక్షానికి మేం సరిపోతాం అని కేటీఆర్ అంటున్నారు. మరి కేసీఆర్ ఎందుకు? ఫ్లోర్ లీడర్‌గా కేటీఆర్ ఉండొచ్చు కదా. కేసీఆర్ బాధ్యత లేని వ్యక్తి’ అని విమర్శించారు. సభ ప్రజాస్వామ్యబద్ధంగానే నడుస్తోందని తెలిపారు.
Similar News
News October 12, 2024
DSP యూనిఫాంలో సిరాజ్.. పిక్ వైరల్!
భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా శుక్రవారం ఛార్జ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిరాజ్‌కు గ్రూప్-1 పోస్టు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ DGPని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు సూటు బూటులో ఉన్న సిరాజ్, ఈరోజు డీఎస్పీగా యూనిఫాం ధరించారు. ఆ పిక్స్ ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆల్ ది బెస్ట్ మియా అంటూ నెట్టింట ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
News October 12, 2024
తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా అమలు చేస్తాం: మంత్రి తుమ్మల
TG: రైతు భరోసాకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్‌ను ఆయన సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. పామాయిల్ పంటకు టన్నుకు రూ.20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.
News October 12, 2024
ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర
AP: ధరల విషయంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న టమాటాలు వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం నష్టాన్ని మిగులుస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గాయి. కిలో రూ.20కి పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3రోజుల క్రితం కిలో రూ.80-100 పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.