News July 12, 2024

ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్‌లోకి పంపుతున్నారు: బండి సంజయ్

image

TG: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే వారిని కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు కేటీఆర్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల ద్వారా నిరుద్యోగులను సీఎం రేవంత్ అణచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.

Similar News

News November 6, 2025

మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

image

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.

News November 6, 2025

ముగ్గురు కూతుళ్లు మృతి.. పరిహారం అందజేత

image

TG: బస్సు ప్రమాదంలో మరణించిన <<18204239>>ముగ్గురు<<>> అమ్మాయిల (తనూష, సాయి ప్రియ, నందిని) తండ్రి ఎల్లయ్యను MLA మనోహర్ రెడ్డి పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ క్రమంలో తండ్రి తన కూతుళ్లను గుర్తు చేసుకుంటూ రోదించారు. ‘నా రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా ఇది?’ అంటూ గుండెలు బాదుకున్నారు.

News November 6, 2025

‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

image

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.