News July 12, 2024
ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్‌లోకి పంపుతున్నారు: బండి సంజయ్

TG: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆరే వారిని కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు కేటీఆర్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల ద్వారా నిరుద్యోగులను సీఎం రేవంత్ అణచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
Similar News
News February 15, 2025
TG SETను మళ్లీ నిర్వహించాలి: BRS

గత ఏడాది SEPలో నిర్వహించిన TG SETలో పెద్ద తప్పిదం జరిగిందని BRS ఆరోపించింది. 100 ప్రశ్నల హిస్టరీ పేపర్‌లో 39 ప్రశ్నలు తప్పు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు రికార్డు సృష్టించిందని ట్వీట్ చేసింది. ‘రెండు పేపర్లలో 40 ప్రశ్నలు తప్పుగా ఇచ్చి రేవంత్ తెలంగాణ పరువు తీశారు. 40 ప్రశ్నలకు 50 మార్కులు ఏ లెక్కన కలిపారు? రేవంత్ రాజీనామా చేయాలి. దీనిపై UGC విచారణ జరిపి పరీక్షను మళ్లీ నిర్వహించాలి’ అని డిమాండ్ చేసింది.
News February 15, 2025
చికెన్‌లో ఈ భాగాలు తింటున్నారా?

కోడిలో దాదాపు అన్ని భాగాలనూ మనం తింటాం. కానీ దాని మెడ, తోక, ఊపిరితిత్తుల్ని తినకుండా ఉండటమే శ్రేయస్కరమంటున్నారు ఆహార నిపుణులు. ఆ భాగాల్లో ఉండే హానికరమైన క్రిములు మనుషుల్లో ఆరోగ్య సమస్యలు కారణమయ్యే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా చర్మంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ ఉంటాయని, స్కిన్ లెస్ తినడమే బెటర్ అని సూచిస్తున్నారు.
News February 15, 2025
IMLT20 టోర్నీకి భారత జట్టు ఇదే

ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్‌లో ఆడే భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ ఈనెల 22న నవీ ముంబైలో భారత్VSశ్రీలంక మ్యాచుతో ప్రారంభం కానుంది.
భారత జట్టు: సచిన్, యువరాజ్, రైనా, రాయుడు, Y పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బిన్నీ, కులకర్ణి, వినయ్ కుమార్, నదీమ్, రాహుల్ శర్మ, పవన్ నేగి, నమన్ ఓజా, గుర్‌కీరత్, అభిమన్యు మిథున్.