News January 28, 2025
ఫోన్ ఆపరేటింగ్ నేర్చుకున్న కేసీఆర్

TG: మాజీ సీఎం కేసీఆర్ సొంతంగా ఫోన్ వాడుతున్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన ఫోన్ ఉపయోగించలేదు. కుటుంబసభ్యులు, నేతలు, సిబ్బంది ఫోన్లతోనే ఆయన ఇతరులతో మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ తనయుడు, తన మనవడు హిమాన్ష్ ఫోన్ ఆపరేట్ చేయడం నేర్పించారు. కేటీఆర్, హరీశ్, కవితతోపాటు పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.
Similar News
News November 18, 2025
శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు.. ఎప్పుడంటే?

AP: రేపు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ ఆర్జిత సేవా డిప్ విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 20 ఉ.10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న మ.3 గంటలకు వర్చువల్ సేవా, 24న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, 25న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటల వసతి గదుల కోటా రిలీజ్ చేయనుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <

ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>