News August 16, 2024
బీఆర్ఎస్ విలీన వార్తలపై కేసీఆర్ స్పందించాలి: విజయశాంతి

TG: బీఆర్ఎస్ విలీన వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ‘బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కానుందని బీజేపీ, బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతల నుంచి వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపై సమాధానం చెప్పవలసిన బాధ్యత కేసీఆర్‌కు ఉంది. రాష్ట్ర ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ జవాబు చాలా అవసరం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.
News September 18, 2025
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 10 రోజుల వరకు సభ నిర్వహించే అవకాశముంది. పంచాయతీరాజ్ సవరణ, AP మోటార్ వెహికల్ ట్యాక్స్, SC వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణ వంటి 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. సూపర్-6 మొదలు సాగునీటి ప్రాజెక్టుల వరకు 20 అంశాలపై చర్చించేందుకు TDP ప్రతిపాదించొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకెళ్లాలని YCP నిర్ణయించుకున్నట్లు సమాచారం.
News September 18, 2025
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

AP: ఇవాళ ఉ.10 గం.కు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ కోటా విడుదల కానుంది. 20న ఉ.10 గం.ల వరకు లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20-22వ తేదీ మ.12 గంటల్లోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీడిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు జారీ చేస్తారు. 22న ఉ.10 గం.కు ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం టికెట్లు, 23న ఉ.11గం.కు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, 24న ఉ.10కి రూ.300 టికెట్లు, మ.3గం.కు రూమ్స్ కోటా విడుదల చేస్తారు.