News August 16, 2024

బీఆర్ఎస్ విలీన వార్తలపై కేసీఆర్ స్పందించాలి: విజయశాంతి

image

TG: బీఆర్ఎస్ విలీన వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ‘బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కానుందని బీజేపీ, బీజేపీలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నేతల నుంచి వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపై సమాధానం చెప్పవలసిన బాధ్యత కేసీఆర్‌కు ఉంది. రాష్ట్ర ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ జవాబు చాలా అవసరం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 19, 2024

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తొలుత ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడో ఓ చోట ఔట్‌డోర్‌లో ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో HYDలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం.

News September 19, 2024

భారత్‌కు మెడల్స్ సాధించడమే లక్ష్యం: మనూ భాకర్

image

భారత్‌కు మరెన్నో మెడల్స్ సాధించిపెట్టడమే తన ఏకైక లక్ష్యమని ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ తెలిపారు. ఎన్డీటీవీ యువ కాంక్లేవ్‌లో ఆమె పాల్గొన్నారు. ‘షూటింగే నా జీవితం. ఇంకేమీ ఊహించుకోలేను. లైఫ్‌లో వీలైనంత ఎక్కువ కాలం షూటింగ్‌లో ఉంటూ ఇండియాకు మెడల్స్ సాధిస్తా’ అని పేర్కొన్నారు. ఆగ్రహం వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు.. కోపాన్ని ఏదైనా మంచిపని మీదకు మళ్లిస్తానని, క్రీడాకారులకు అది కీలకమని ఆమె వివరించారు.

News September 19, 2024

నీ పని ఇదేనా రేవంతు?: TBJP

image

TG: CM రేవంత్‌రెడ్డిపై X వేదికగా రాష్ట్ర BJP విమర్శలు గుప్పించింది. ‘నీ పని ఢిల్లీకి సూట్‌కేసులు మోయడమా?, గాంధీ కుటుంబానికి భజన చేయడమా?, తెలంగాణేతరులకు ఉద్యోగాలివ్వడమా?, సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు పెట్టడమా?, బూతులు తిట్టడమా?, నీ సోదరులకు కంపెనీలు పెట్టివ్వడమా?, నీ సొంత కంపెనీలకు ప్రాజెక్టులిప్పించడమా?, పేదల ఇండ్లు కూల్చి ఒవైసీ, తిరుపతిరెడ్డి బంగ్లాలు కాపాడటమా?’ అని ట్వీట్ చేసింది.