News December 5, 2024

ఫామ్‌హౌస్‌ల నిర్మాణంపైనే KCR దృష్టి: CM

image

TG: పదేళ్ల BRS హయాంలో పేదలకు ఇళ్లు కేటాయించలేదని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘KCR తనకు అవసరమైన ప్రగతిభవన్‌ను ఆఘమేఘాల మీద పూర్తి చేశారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూలగొట్టి కొత్తదాన్ని వేగంగా నిర్మించుకున్నారు. ప్రతి జిల్లాలో BRS కార్యాలయాలను కట్టుకున్నారు. గజ్వేల్, జన్వాడ ఫామ్‌హౌస్‌ల నిర్మాణంపైనే KCR దృష్టి పెట్టారు కానీ పేదల ఇళ్ల పథకానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు’ అని CM విమర్శించారు.

Similar News

News January 18, 2025

నేటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం

image

AP: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషీన్లు వచ్చేశాయి. గరిష్ఠంగా 90 మీ. లోతు వరకు నదీగర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్‌తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది.

News January 18, 2025

ఇంటర్ సిలబస్‌లో మార్పులు?

image

TG: మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఫిజిక్స్‌లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి అంశాలు చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జువాలజీలో కొవిడ్ పాఠ్యాంశాన్ని చేర్చనున్నట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరంలోని పుస్తకాల్లో ఈ అంశాలను ప్రింట్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మరోవైపు సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

News January 18, 2025

నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వినాయక్ నగర్‌లో మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్తారు. ZPHS వరకూ కాలినడకన ర్యాలీలో పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు.