News November 29, 2024
కేసీఆర్ దీక్షకు ఊపిరి పోసిన ఫ్రీజోన్ రగడ
కేసీఆర్ దీక్ష చేయడానికి ప్రధాన కారణం పోలీసు ఉద్యోగాల్లో ఫ్రీజోన్ రగడ. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం HYDను ఆరో జోన్లో భాగం. కానీ ప్రభుత్వం HYD ఫ్రీజోన్‌గా పరిగణించి నియామకాలు చేపట్టింది. సుప్రీంకోర్టు కూడా ఫ్రీజోనే అంటూ తీర్పునిచ్చింది. దీంతో HYD సిటీ పోలీస్ ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ లేకుండా పోవడంతో నిరుద్యోగులు ఉద్యమం చేపట్టారు. KCR దీక్షకు దిగడంతో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది.
Similar News
News December 9, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 9, 2024
బిగ్‌బాస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్
Bigg Boss సీజన్-8 నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాగా, శనివారం రోహిణి హౌస్ నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. చివరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. చివరి దశకు చేరుకున్న ఈ సీజన్ టాప్-5లో నబీల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లు ఉన్నారు.
News December 9, 2024
డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు
1946: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(ఫొటోలో) జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం