News September 15, 2024

BRS శ్రేణులతో త్వరలో కేసీఆర్ కీలక భేటీ!

image

TG: మాజీ సీఎం KCR వారం, పది రోజుల్లో BRS శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రైతు భరోసా, అసంపూర్ణ రుణ మాఫీ, పంట పరిహారం, అన్నదాతల ఆత్మహత్యలు, పార్టీ నేతలపై దాడులు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి పార్టీ MLAలు, MLCలు, MPలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రెసిడెంట్లు హాజరవుతారని సమాచారం.

Similar News

News December 26, 2025

స్టేట్ బోర్డు నుంచి CBSEలోకి స్కూళ్ల మార్పు

image

స్టేట్ బోర్డుల పరిధిలో ఉన్న స్కూళ్లు క్రమేణా CBSEకి మళ్లుతున్నాయి. TGలో 5 ఏళ్లలో 113 స్కూళ్లు ఇలా మారాయి. అటు ఏపీలోనూ అదే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే 1000 స్కూళ్లలో CBSEని ప్రవేశపెట్టింది. NCERT సిలబస్ బోధన వల్ల JEE, NEET సహా పోటీ పరీక్షలకు మేలన్న భావనతో పేరెంట్స్‌ ఈ స్కూల్స్‌ వైపు మొగ్గుతున్నారు. దీంతో యాజమాన్యాలూ అటే మారుతున్నాయి. దేశంలో CBSE స్కూళ్లు 31879 ఉండగా APలో 1495, TGలో 690 ఉన్నాయి.

News December 26, 2025

అరటి తోటల్లో కలుపు నివారణ ఎలా?

image

అరటి తోటల్లో కలుపు నివారణ చాలా ముఖ్యం. దీని కోసం హెక్టారుకు 500 లీటర్ల నీటిలో బుటాక్లోర్ 5లీటర్లు లేదా అలాక్లోర్ 2.5లీటర్ లేదా పెండిమెథాలిన్ 2.5లీటర్లలో ఏదో ఒక మందును కలిపి నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. దీని వల్ల కలుపు మొలవకుండా అరికట్టవచ్చు. 100 మైక్రానుల మందం కలిగిన పాలిథీన్ మల్చింగ్ షీటును నేలపై పరచి ఆ తర్వాత మొక్కనాటితే కలుపు సమస్యను అధిగమించవచ్చు.

News December 26, 2025

ఈ రాత్రి ఢిల్లీకి సీఎం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు CWC సమావేశంలో పాల్గొననున్నారు. ఎల్లుండి హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. అందులో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.