News September 15, 2024
BRS శ్రేణులతో త్వరలో కేసీఆర్ కీలక భేటీ!
TG: మాజీ సీఎం KCR వారం, పది రోజుల్లో BRS శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రైతు భరోసా, అసంపూర్ణ రుణ మాఫీ, పంట పరిహారం, అన్నదాతల ఆత్మహత్యలు, పార్టీ నేతలపై దాడులు తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి పార్టీ MLAలు, MLCలు, MPలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రెసిడెంట్లు హాజరవుతారని సమాచారం.
Similar News
News October 9, 2024
పాకిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాక్?
పాకిస్థాన్ టీమ్‌కు ICC బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. UAE, శ్రీలంక, సౌతాఫ్రికాల్లో ఎక్కడో ఓ చోట టోర్నీ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. లేదంటే హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచులు పాక్ ఆవల నిర్వహించాలని భావిస్తున్నట్లు టాక్. BCCI అంగీకరిస్తే పాక్‌లోనే టోర్నీ ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News October 9, 2024
ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం
AP: లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11 వరకు అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. వాటిని వెరిఫై చేసి 14న డ్రా తీసి సెలక్ట్ చేస్తామని చెప్పారు. 16 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
News October 9, 2024
టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు
AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.