News April 24, 2024
KCR మోకాళ్ల యాత్ర చేసినా డిపాజిట్ రాదు: కోమటిరెడ్డి
TG: కేసీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆయన మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలకు కాలం చెల్లిందని, పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ రాదని, త్వరలో తండ్రీకొడుకులు జైలుకెళతారని అన్నారు.
Similar News
News January 17, 2025
సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై క్యాబినెట్‌లో చర్చ
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు, సచివాలయాల్లో RTGS ఏర్పాటుపై CM చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్‌లో చర్చ జరిగింది. అటు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.
News January 17, 2025
రెచ్చిపోయిన దొంగలు.. కర్ణాటకలో మరో భారీ చోరీ
కర్ణాటకలో మరో భారీ చోరీ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌లో బ్యాంకులోకి చొరబడిన దొంగల ముఠా నగదు, బంగారం ఎత్తుకెళ్లింది. కారులో వచ్చి బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నిన్న బీదర్‌లోనూ దొంగల ముఠా ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే వాహనం సిబ్బందిపై <<15169507>>కాల్పులు<<>> జరిపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మరణించారు.
News January 17, 2025
‘వీరమల్లు’ లాంటి కథలు అరుదుగా వస్తాయి: బాబీ డియోల్
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమని బాబీ డియోల్ తెలిపారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చరిత్రలో జరిగిన కథలు ఎమోషనల్‌గానే కాకుండా మాస్‌గానూ ఉంటాయని ఈ స్టోరీ విన్నప్పుడే అర్థమైందన్నారు. ఇలాంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇవాళ మూవీ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది.