News May 3, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR పేరు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ CM KCR పేరు వెలుగులోకి వచ్చింది. టాస్క్‌ఫోర్స్ మాజీ OSD రాధాకిషన్ రావు వాంగ్మూలంలో KCR పేరును ప్రస్తావించారు. ‘విపక్షాల ఎత్తుగడలను ముందుగానే తెలుసుకుని చిత్తు చేయడానికి తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులతో టాస్క్‌లు చేయించాం. KCRతోపాటు BRS నేతలకు ముప్పుగా ఉన్న వారిని గుర్తించి లొంగదీసుకున్నాం. కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేశాం’ అని ఆయన వాంగ్మూలంలో చెప్పారు.
Similar News
News November 4, 2024
రేపు ఆవర్తనం.. విస్తారంగా వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడి రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. గత నెలలో 3 అల్పపీడనాల కారణంగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
News November 4, 2024
విశాఖ స్టీల్‌కు రూ.1650 కోట్ల సాయం
AP: ఆర్థిక, నిర్వహణ సవాళ్లతో ఇబ్బందిపడుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.1650 కోట్ల సాయం అందించింది. సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 19న ఈక్విటీ కింద రూ.500 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద రూ.1150 కోట్లు అందించినట్లు వివరించింది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకునేలా SBI ఆధ్వర్యంలో ఒక నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.
News November 4, 2024
ఇవాళ్టి నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్
TG: బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇవాళ్టి నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్, స్లాట్ బుకింగ్‌కు ఇవాళ్టి వరకు అవకాశం ఉంది. రేపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 9న సీట్లు కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు https://tgeapcetb.nic.inను చూడండి.